10-01-2026 03:07:42 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే వీర్ గాథ ప్రాజెక్ట్ 5.0, 2025 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.92 కోట్ల మంది విద్యార్థులు ప్రాథమిక మాధ్యమిక మరియు ఉన్నత విభాగాలలో పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్రీయ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అన్ని రాష్ట్రాల నుంచి 100 మంది విద్యార్థులను ''సూపర్ 100” గా ఎంపిక చేయడం జరిగింది.
పారమిత హెరిటేజ్ పాఠశాలకి చెందిన 9వ తరగతి విద్యార్థిని కృతి యెన్నం జాతీయ స్థాయిలో వీర్ గాథ 5.0 "సూపర్ 100" విజేతలలో ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గోపికృష్ణ తెలిపారు. వీర్ గాథ 5.0 ప్రాజెక్ట్ భారతదేశ యోధులు/శౌర్య అవార్డు విజేతల విజయాల గురించి కవిత, పేరా, వ్యాసం, పెయింటింగ్ వంటి కళ-సమగ్ర కార్యకలాపాలపై నిర్వహించింది.
న్యూఢిల్లీలోనీ కర్తవ్య పథ్ లో జరిగే 2026 గణతంత్ర దినోత్సవ పరెడ్ కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ "సూపర్ 100" విజేతలను సత్కరిస్తారు. విద్యార్థినికి రూ. 10,000 నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం లభిస్తుంది. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, వి.యు.యం. ప్రసాద్, హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు రాము,గైడ్ టీచర్ వినయ్ ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.