calender_icon.png 5 November, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ రోడ్డులో మరో ప్రమాదం

05-11-2025 01:23:37 AM

-లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు - 

-బస్సు డ్రైవర్‌కు గాయాలు

-కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ట్రాక్టర్లను ఢీకొన్న బస్సులు

-పలువురికి గాయాలు

తాండూరు, నవంబర్ 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఘటన మరవకముందే అదే రోడ్డులోని వికారాబాద్ జిల్లా తాండూ రు మండలం కరన్‌కోట్ గ్రామ శివారులో మంగళవారం మరో ప్రమాదం జరిగింది. తెలంగాణ సరిహద్దు సాగర్ సిమెం ట్ కర్మాగారం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు,- సిమెంట్ లారీని ఢీకొట్టింది. కర్ణాటక రాష్ట్రం కలబురిగి నుంచి తాండూరు మీదుగా హైదరాబాద్‌కు కర్ణాటక ఆర్టీసీ బస్సు దాదా పు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సాగర్ సిమెంట్ కర్మాగారం వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీని ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

మిర్యాలగూడ/మాడుగులపల్లి: ట్రాక్టర్‌ను ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావలికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాదుకు బయలుదేరింది. బస్సు కుక్కడం వద్దకు చేరుకోగానే అదే సమయంలో మిర్యాలగూడ నుంచి మాడుగులపల్లి మండలం తోపుచర్ల గ్రామం లో వరిపొట్టు తీసుకెళ్లేందుకు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఫల్టీ కొట్టింది.

ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మిర్యాలగూడ పట్టణంలోని షాబూ నగర్‌కి చెందిన ఏర్పుల కవిత కాలు, చెయ్యి విరగింది. టీక్యా తండాకు చెందిన దిరావత్ లీలా తలకు గాయాలయ్యాయి. ఇదే  తండా కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నిరంజన్, దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన అజ్మీర సౌజన్య, అజ్మీర రమేష్‌లకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తర లించారు. అజ్మీర రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ య్య తెలిపారు. కాగా ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మానకొండూర్(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై మంగళవారం ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి బస్సు ఢీ కొట్టడంతో ట్రాక్టర్ పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందు లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాదు నుంచి మెట్టుపల్లి కి వెళ్తుండగా రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో బస్సు 50 స్పీడ్‌తో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వేగం తక్కువగా ఉండ టం వల్లే ప్రమాద తీవ్రత తక్కువ ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. బస్సులో అందరూ నిద్రపోతూ ఉండటం వల్ల బస్సు అద్దాలు గుచ్చుకొని గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణిపూర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, తిమ్మాపూర్ పోలీసులతో మాట్లాడి సంఘటన పై అరా తీశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.