calender_icon.png 5 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

05-11-2025 01:33:19 AM

ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఒకవైపు పోలింగ్ ప్రక్రియలో కీలకమైన మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇస్తూనే, మరోవైపు ఇంటి వద్ద ఓటింగ్ హోం ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిం ది. ఈ కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి, జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మం గళవారం పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

జీహెఎంసీ ప్రధాన కార్యాలయం లో మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ పోలింగ్ ప్రతి దశలోనూ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందన్నారు. మాక్ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల పరిశీలన, ఓటర్ల గుర్తింపు, ఈవీ ఎంల సీలింగ్, ఓటు గోప్యతను కాపాడటం వంటి కీలక అంశాలపై ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ రోజున అప్రమత్తంగా, నిష్పా క్షికంగా విధులు నిర్వర్తించాలన్నారు.