05-11-2025 01:21:44 AM
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ.వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి, సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది.