calender_icon.png 8 November, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వరల్డ్ రేడియోగ్రఫీ డే వేడుకలు

08-11-2025 05:44:01 PM

హనుమకొండ (విజయక్రాంతి): వరల్డ్ రేడియోగ్రఫీ డే సందర్భంగా హనుమకొండ చక్రవర్తి హాస్పిటల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యకులు అరికిల్ల సుమన్ ఆధ్వర్యంలో రేడియాలజీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి హాజరై హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి హాస్పిటల్లో ఒక రోగాన్ని కనుక్కోవడం అనేది చాలా ముఖ్యమని అందులో ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైందని, ఏ డాక్టర్ అయినా రోగంని నయం చేయాలంటే మొదటగా రోగ నిర్ధారణ చేయాలి.

అదే రీడియాలజీ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం ఎంతోమంది బీద ప్రజలకు సేవలు  అందిస్తున్నందుకు చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల పెళ్లి జయరాజు, మీడియా కన్వీనర్ శనిగిరపు శోభన్ బాబు, చిర్రగోని అశోక్, ప్రతాప్, రేవంత్, గండి రాజు, గుర్రం రాకేష్, కుక్కల ప్రవీణ్, వెంకటేష్, బొల్లం నాగరాజు, జల్లి రజనీకాంత్, ఎల్తూరి రాజు, చిలుముల రంజిత్ కుమార్, నవీన్, మాచర్ల కరుణాకర్, తరుణ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.