calender_icon.png 8 November, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించాలి

08-11-2025 05:53:49 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం.. ప్రచార గడువు ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించాలన్నారు. ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ ఉపఎన్నిక వచ్చిందని, మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలోనే ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి అని, జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసే శక్తి, యుక్తి ఆయనకు ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షం గెలిస్తే అలా అభివృద్ధి చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను ప్రకటిస్తారు.