calender_icon.png 8 November, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోనల్ స్పోర్ట్స్ మీట్ లో ప్రభంజనం సృష్టించిన పాలకుర్తి, అడ్డగూడూరు గురుకులం

08-11-2025 05:50:03 PM

ముగింపు బహుమతి ప్రధానములో కేరింతలు కొట్టిన గురుకుల విద్యార్థులు..

జోనల్ గేమ్స్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన డిసిఓ శోభారాణి ప్రిన్సిపాల్ సంధ్యారాణి..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రమైన సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాల, కళాశాలలో మూడు రోజులపాటు కొనసాగిన జోనల్‌ స్థాయి క్రీడా పోటీల్లో జనగాం జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాల ఛాంపియన్‌గా నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్ చిప్ అండర్ 14 విభాగంలో పాలకుర్తి 30 పాయింట్లతో; అండర్- 17 జాఫర్ గాడ్ 30 పాయింట్లతో; అండర్- 19 అడ్డగూడూరు- 35 పాయింట్లతో విజేతగా నిలిచింది.

ఓవరాల్ ఛాంపియన్ అండర్- 14 వలిగొండ గురుకుల పాఠశాల 25 పాయింట్లు; అండర్ 17 ఆలేరు 39 పాయింట్లు; అండర్- 19 విభాగంలో వలిగొండ గురుకుల పాఠశాల 34.లతో విజేతగా నిలిచింది. అథ్లెటిక్స్ విభాగంలో అండర్- 14 విభాగంలో 44 మా ఇంట్లో రాగా,అండర్- 17 విభాగంలో ఆలేరు 49 పాయింట్లు; అండర్-19 విభాగంలో వలిగొండ గురుకుల పాఠశాల 59 పాయింట్లతో విజేతగా నిలిచింది. వ్యక్తిగత ఛాంపియన్ చిప్ విభాగంలో అండర్- 14 నాగ పూజిత (పాలకుర్తి); అండర్- 17 తేజశ్రీ 45 పాయింట్లు (ఆలేరు); అండర్- 19 దివ్య (ఆలేరు) విజేతలుగా నిలిచారు.మూడు విభాగాల్లో ఆత్యధిక పాయింట్లు సాధించి విజేతగా నిలవడంతో జోనల్‌ స్థాయి చాంపియన్‌గా పాలకుర్తి, అడ్డగూడూరు గురుకుల పాఠశాలలకు ట్రోఫీలు అందజేశారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి

గురుకులం డిసిఓ శోభారాణి

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి దోహదపడతాయని గురుకుల పాఠశాల జోనల్ అధికారి అరుణ కుమారి స్పష్టం చేశారు.మూడు రోజుల పాటు కొనసాగిన 11వ జోనల్‌ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురుకులాల క్రీడలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. రెండవ రోజు వేడుకలకు జోనల్ అధికారి అరుణ కుమారి శుక్రవారం రాత్రి ముఖ్య అతిథిగా హాజరవగా శనివారం శనివారం జరిగిన ముగింపు వేడుకలకు నల్గొండ డిసిఓజె శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై ముగింపు వేడుకలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో పాటు కబడ్డీ ఆడి అందరిని ఆకట్టుకున్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం  జిల్లాలకు చెందిన 09 గురుకుల పాఠశాలలకు చెందిన 765 మంది విద్యార్ధులు క్రీడల్లో పాల్గొన్నారు.

ముగింపు సందర్భంగా విద్యార్ధుల ఆటపాటలతో సందడి నెలకొంది. విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు, బతుకమ్మ ఆడారు. అనంతరం వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు వేడుకలో పాఠశాల ప్రిన్సిపాల్ కే. సంధ్యారాణి, నకిరేకల్, తిప్పర్తి, కట్టంగూర్, నిడమానూరు, చండూరు ప్రిన్సిపాల్ లు, స్పోర్ట్స్ ఓవరాల్ ఇన్చార్జి జ్యోతిర్మయి, డాక్టర్ విజయ్ కుమార్, హెచ్ ఈ ఓ రవికుమార్, తల్లిదండ్రుల కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, పీడీలు, పీఈటీలు, మూడు జిల్లాల గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్‌ లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.