calender_icon.png 8 November, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 ఏళ్ల కల నిజం రఘుపతి గుట్టకు సీఎం వరం..

08-11-2025 05:30:55 PM

రామాయంపేట (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ప్రభుత్వం, మన ప్రజాహిత నాయకుడు ముఖ్యమంత్రి వారి ఆప్యాయ దృష్టితో రఘపతిగుట్ట గ్రామానికి 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. గ్రామ అభివృద్ధి దిశగా సీఎం ఆదేశాల మేరకు రూ. 2 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణానికి మంజూరు లభించింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆనందం నెలకొంది. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి రహదారి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు.

అధికారులు, పరిశీలన చేస్తూ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఇది మాకు దశాబ్దాల కల. మా గ్రామ అభివృద్ధి వైపు సీఎం దృష్టి నిలవడం పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు” అన్నారు. ప్రజలతో పాటుగా స్థానిక యువత, మహిళా సంఘాలు, రైతు ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రజల ఆశయాలు నిజం చేసే ప్రజా ప్రభుత్వం ఇదే” గ్రామస్థుల అభిప్రాయం.