calender_icon.png 31 December, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

31-12-2025 01:16:03 AM

  1. కాల్చి చంపిన సహోద్యోగి

మూడుకు చేరిన మృతుల సంఖ్య

భగ్గుమన్న ధార్మిక సంఘాలు

ఢాకా, డిసెంబర్ 30: మొన్న దీపూ చంద్రదాస్.. ఇటీవల అశోక్ సామ్రాట్.. తాజాగా బజేంద్ర విశ్వాస్.. నెలరోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్‌లో ముగ్గురు హిందువుల హత్య కలకలం రేపుతున్నది. సోమవారం సహోద్యోగి జరిపిన కాల్పుల్లో బజేంద్ర బిశ్వాస్(42) మృతిచెందాడు.  బజేంద్ర బిశ్వాస్ భలుకా ఉపజిల్లా ప్రాంతంలోని ఒక వస్త్ర కర్మాగారంలో బజేంద్ర బిశ్వాస్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. నోమన్ మియా అనే వ్యక్తి కూడా ఇదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, నోమన్ మియా గన్ తీసి కాల్పులకు జరిపి హతమార్చాడు.