calender_icon.png 31 December, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియాంక గాంధీ ఇంట పెళ్లిబాజాలు

31-12-2025 01:17:28 AM

  1. కుమారుడు రెహాన్ నిశ్చితార్థం?

తన స్నేహితురాలు అవీవా బేగ్‌కి రెహాన్ పెళ్లి ప్రాతిపాదన

అవీవా ఆమోదించడంతో వివాహ బంధంలోకి..

న్యూఢిల్లీ, డిసెంబర్ ౩౦: ఏఐసీసీ అగ్రనాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. రెహాన్ తన స్నేహితురాలైన అవీవా బేగ్‌ను వివా హం చేసుకోబోతున్నాడు. కుటుంబ స భ్యులు, పరిమితమైన సన్నిహితుల మధ్య నిరాడంబరంగా నిశ్చితార్థ వేడుక జరిగినట్లు జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు ప్రసారమవుతున్నాయి.

రేహాన్-, అవీవా చిరకాల స్నేహితులు. రెండు కుటుంబాలకు ముందు నుంచీ స్నేహసంబంధాలు ఉన్నాయి. రేహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్. వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో తనదైన గుర్తింపు తెచ్చు కున్నాడు. అవీవా కూడా ఫొటోగ్రాఫరే. ఆమె బేగ్ తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త. తల్లి నందిత బేగ్ ఇంటీరియర్ డిజైనర్. ప్రియాంక గాంధీ, నందిత బేగ్ చిన్ననాటి స్నేహితులు.

ఇద్దరూ చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నారు. అవీవా కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. అవీవా ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఏడేళ్ల స్నేహాన్ని వీరు ప్రేమబంధంగా మార్చుకున్నారు. రేహాన్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేటు వేడుకలో అవీవా ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, అందుకు ఆమె ఆమోదించినట్లు సమాచారం. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు తెలిసింది.