26-01-2026 02:26:37 AM
అర్ధరాత్రి గ్యారేజీకి దుండగుల నిప్పు
ఢాకా, జనవరి 25 : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. ఓ గ్యారేజీపై అర్ధరాత్రి దుండగలు పెట్రోల్ పోసి నిప్పింటించారు. అందులో నిద్రిస్తున్న చంచల్ చంద్ర భౌమిక్(23) మంటల్లో చిక్కుకుని దహనమయ్యాడు. నర్సింగ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా దేశంలో మైనారిటీల భ ద్రతపై మరోసారి ఆందోళనలను పెంచింది.
బాధితుడు చంచల్ చంద్ర భౌమిక్ కొన్ని ఏళ్లుగా ఒక గ్యారేజీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి గ్యారేజీలో నిద్రిస్తున్న సమ యంలో దుండగులు బయట నుంచి పెట్రో ల్ పోసి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో చంచల్ గ్యారేజీ లోపలే చిక్కుకొని దుర్మరణం పాలయ్యాడు. నర్సింగ్డి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.