06-05-2025 12:17:26 AM
రాజేంద్రనగర్, మే 5 : ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ లారీని ఢీకొనడంతో క్లీనర్ తీవ్రంగా గా యపడి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి కథనం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపాడు.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్ వద్ద ముందు వెళ్తున్న గుర్తు తెలియని లారీని ఢీకొంది. ఈ ప్రమా దంలో ప్రమాదానికి కారణమైన లారీ క్లీనర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.