calender_icon.png 6 May, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

06-05-2025 12:18:22 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, మే 5 : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారు లకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.   ఈరోజు ప్రజావాణికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి.ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారు లు తదితరులు పాల్గొన్నారు.