calender_icon.png 17 May, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులు నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి

06-05-2025 12:16:53 AM

 గోపాల్ దిన్నె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలన: కలెక్టర్ సంతోష్

గద్వాల, మే 05 ( విజయక్రాంతి ) : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ని ర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సం తోష్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నె  గ్రా మంలో ఇందిరమ్మ ఇండ్ల ప నులను, క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

గ్రామంలో ఇండ్ల నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు విడతల వారిగా 5 లక్షల రూపాయలను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు  అందిస్తున్నందున లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా నిర్మాణ పనులు త్వర గా ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు.  నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణ విధానాన్ని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని హౌసింగ్ అధికారుల కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మోహినుద్దీన్, హౌసింగ్ పీ.డి శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.