calender_icon.png 16 May, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రేజీ జోడీతో మరో సినిమా

16-05-2025 12:29:38 AM

బేబి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను ఖాతా లో వేసుకున్న టాలీవుడ్ యువ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోమారు జోడీ కట్టనున్నారు. వీరిద్దరూ నాయకానాయికలుగా మరో సినిమా వస్తోంది. ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్‌సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు  దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు రష్మిక మందన్న ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. నేషనల్ క్రష్ క్లాప్ కొట్టగా నటుడు శివాజీ కెమెరా స్విచ్‌ఆన్ చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఆదిత్య హాసన్‌కు కథను అందించారు. ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’కు కొనసాగింపుగా ఈ సినిమా లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోంది. శివాజీ, వాసంతిక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్, ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ నిర్మించనున్నారు.