16-05-2025 12:31:21 AM
ప్రేక్షకుల హృదయాలను తడిచేసిన ప్రేమకథల్లో ‘7/జీ బృందావన్ కాలనీ’ ఒకటి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ లవర్స్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 2004లో విడుదలైన ఆ సినిమా కు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన్ కాలనీ2’ టైటిల్‌తో రూపొందుతోంది.
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇంతకాలం ఇవానా, అదితి శంకర్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితో ఈ రోల్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త వినవస్తోంది. మలయాళ చిత్రం ‘రేఖాచిత్రం’తో గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ ఇందులో కథానాయికగా నటించనుందనేది తాజాగా వినవస్తున్న టాక్. తాజాగా మరో కథానాయిక పేరు వినవస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.