calender_icon.png 15 December, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మరో ఎదురుదెబ్బ

10-12-2025 01:11:47 AM

సర్పంచ్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు వరుస షాకులు

నిజాంసాగర్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): సర్పంచ్ ఎన్నికలవేళ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి  పిట్లం మండలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోమవారం నాడు పిట్లం మండల పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దెల నవీన్,పిట్లం మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు, పిట్లం మాజీ ఏ ఎం సి డైరెక్టర్ కుమ్మరి యాదగిరి మంగళవారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వరుస చేరికలతో పిట్లంలో బీఆర్‌ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు సులభతరం అయ్యింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ,పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ , మండల సీనియర్ నాయకులు రాంరెడ్డి ,ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి  పాల్గొన్నారు.