17-08-2025 12:21:26 AM
రేపు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (విజయ క్రాంతి): దివ్యాంగులకు చేయూతనం దించి, వారి జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో సోమాజిగూడలోని సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ వేదికగా సోమవారం ‘ఫ్రీ మెగా సర్జికల్ కరెక్షన్ అండ్ హెల్త్ క్యాంప్’ను నిర్వహించనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాం చీ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ వం టి పలు ప్రముఖ స్వచ్ఛంద సంస్థల సం యుక్త భాగస్వామ్యంతో ఈ శిబిరాన్ని ఏర్పా టు చేస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అధ్యక్షత వహించనున్నారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణలో డిసేబుల్ ట్రస్ట్ సీఈవో, ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ భాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దివ్యాంగులకు అవసరమైన శస్త్రచికిత్సల దగ్గర నుం చి, వారికి అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం వరకు అన్ని ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.