02-12-2025 01:58:43 AM
-వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు
వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్01,(విజయక్రాంతి):పత్తి దళాల్లోనని మోసపోవద్దని వెంకటాపూర్ ఎస్త్స్ర చల్లా రాజు అన్నారు. సోమవారం వెంకటాపూర్ మండలంలోని బూరుగుపేట గ్రామపంచాయతీ పరిధిలోగల ఎన్నికల నామినేషన్ నిమిత్తం తిమ్మాపూర్ వెళ్తున్న క్రమంలో పత్తి దళారులు కనబడడంతో అక్కడ ఆగి రైతులతో మాట్లాడారు.
పత్తి దళారులను నమ్మి పత్తి వేయద్దు అని సూచనలు చేశారు. సి సి ఐ ములుగు జిల్లాలో ఉంది అని రైతులకు తెలిపారు. వెంటనే వారి కాంటను తనిఖీ చేసి ఇంకోసారి ఈ మండలంలో రైతులను మోసం చేయొద్దని దళారులకు సూచించారు వారి వెంట పోలీస్ సిబ్బంది రైతులు ఉన్నారు.