calender_icon.png 2 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ జీవితానికి ఉపయోగపడాలి

02-12-2025 01:06:02 AM

జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య 

కొత్తపల్లి, డిసెంబరు 1 (విజయ క్రాంతి): సైన్స్ జీవితానికి ఉపయోగపడాలని జిల్లా విద్యాశా ఖ అధికారి శ్రీరామ్ ముండయ్య అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో గత మూడు రోజులుగా జరుగుతున్న బాల వైజ్ఞానిక ప్రదర్శిన 2025-26 సోమవారం ముగిసిం ది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పిల్లలు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ప్రతి వి ద్యార్థి లోపల ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడని, అతనిని బయటకు తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని తెలిపారు. శ్రమ పట్టుదలతో పని చేస్తే సాధించలేనిది ఏమీలేదని, విద్యార్థులు శ్రమించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.

అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి. నరేందర్ రెడ్డి, జిల్లా సై న్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్ భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి,ఎస్జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్, కొత్తపల్లి మండల విద్యాశాఖాధికారి ఆనందం, ఏనుగు ప్రభాకర్ రె డ్డి, వివిధ మండలాల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల రవీందర్, కెఎస్.అనంతాచార్య, స్తంభంకాడి గంగాధర్, తదితరులుపాల్గొన్నారు.