calender_icon.png 2 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఎస్‌ఎస్‌కేగా మహబూబాబాద్

02-12-2025 01:57:24 AM

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హెచ్‌ఐవి బాధితులకు సరైన వైద్య సహాయం, సూచనలు, సలహాలు, హెచ్‌ఐవి విస్తరించకుండా ముందస్తు నివారణ చర్య లు చేపట్టడంలో మహబూబాబాద్ జిల్లా సంపూర్ణ సురక్ష కేంద్రం (ఎస్ ఎస్ కే) విశిష్ట సేవలు అందించి రాష్ట్రంలో ప్రధమంగా నిలిచింది.

ఈ మేరకు సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మహబూబాబాద్ ఎస్‌ఎస్ కే మేనేజర్ బానోతు రమేష్, ఐ సి టి సి కౌన్సిలర్ కుసుమ రమేష్ కు ప్రశంసా పత్రంతోపాటు మేమెంటో అందించి అభినందించారు.