21-05-2025 12:34:35 AM
ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసిస్తూ హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర లేబర్ కార్యా లయం, అంజయ్య భవనం ముందు బహుజన, వామపక్ష కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున హాజరై ధర్నా కార్యాక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రం గా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
2025, మే-20 న జరగాల్సిన సార్వత్రిక సమ్మె అనివార్యంగా జూలై-9 కి వాయిదా వేయడం వలన మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు, ధర్నాలు, సమస్యలపై వినతి పత్రాలు అందజేయాలని బహు జన వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో బాగంగా మంగళ వారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దు, 44 కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు.
కనీస వేతనం 30 వేలు, బీడి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేలు, కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలు జీఎస్టీ మినహాయించి, జీవన భృతిని చెల్లించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సంభందిత రాష్ట్ర లేబర్ కమీషన్ కార్యాలయంలో సంయుక్త కార్మిక లేబర్ కమీషనర్ (హెడ్ క్వాటర్స్) ఆర్. చంద్రశేఖరానికి సమర్పించారు. వెంట నే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళుతామని చంద్రశేకరం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీబీఎన్‌సీకేయూ రాష్ట్ర నాయకుడు కల్లెపు చెంద్రశేఖర్ ప్రసాద్. బిఎల్ టీయూ, రాష్ట్ర నాయకులు, మరోజు, సునీల్, పాండు ఐఎఫ్‌టియు. షేక్ షావలి, పిఓడబ్ల్యూ(విముక్తి) పి.సునీత, సేవా సంస్థ రేణుక, టియుజేఏసి.
సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, కెహెచ్ పిఎస్ సుర్గు ప్రబాకర్, ఏఐఎఫ్‌టీ యూ (అధ్యక్షుడు) వై.మల్లేష్, టిబివైజియు కనకం ఆంజినేయులు, అనిల్, ఏఐసిటి యు పి.యు.కె.యు. ఏ.యాదగిరి తధితర కార్మిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.