17-05-2025 09:45:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విధులు నిర్వహించి పదోన్నతిపై వెళ్తున్న పలువురు అధికారులకు శనివారం బ్యాంక్ సిబ్బంది ఖాతాదారులు సన్మానం చేశారు. మేనేజర్ శ్రీ జయంత్, ఆఫీసర్స్.. శ్రీ అనిల్ కుమార్, శ్రీ రాజశేఖర్ రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారిని బ్రాంచి సిబ్బంది కృష్ణా రాథోడ్, గంగాధర్, మనోహర్, గోల్డ్ అప్రైజర్స్ కోటగిరి శ్రీధర్, ముప్పిడి సూర్యనారాయణ, సబ్ స్టాప్.. రాజు, వినోద్, ఆధార్ సెంటర్.. రాజు శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు.