calender_icon.png 7 May, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శర్వాతో మరోసారి..

27-04-2025 12:00:00 AM

శర్వానంద్ ప్రస్తుతం ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘శర్వా38’ అనే వర్కింగ్ టైటిల్ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.  1960ల చివరలో ఉత్తర తెలంగాణ సరిహద్దులో జరిగిన కథగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించనుందని మూవీ యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఇందులో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనుందని అధికారికంగా ప్రకటించారు. కథలో అనుపమ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని టీమ్ పేర్కొంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ గతంలో ‘శతమానం భవతి’లో జోడీ కట్టిన విషయం తెలిసిందే.