27-04-2025 12:00:00 AM
‘తండేల్’ విజయం తర్వాత మరో భారీ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు అక్కినేని నాగచైతన్య. ఇందుకోసం నాగచైతన్య.. తన తొలి సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దర్శకుడు కార్తీక్ దండుతో కొలబరేట్ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి మైథలాజికల్ థ్రిల్లర్‌ను చేయబోతున్నారు. ప్రస్తుతానికి ‘ఎన్‌సీ24’ అనే మేకింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి తెర వెనుక ఉన్న రేర్ సీన్స్‌ను ప్రజెంట్ చేస్తూ మేకర్స్ తాజాగా ‘ఎన్‌సీ24 ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్’ పేరుతో ఎలక్ట్రిఫైయింగ్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఏళ్ల తరబడి చేసిన ఆలోచనలు, నెలల తరబడి కష్టపడిన చేసిన ప్రీ-ప్రొడక్షన్, రోజుల తరబడి చేసిన కఠినమైన రిహార్సల్స్ వరకు.. ఈ సినిమాటిక్ వండర్‌కు ప్రాణం పోసే హార్డ్ వర్క్ అంతా ఈ వీడియోలో చూడొచ్చు.
నాగచైతన్య తన పాత్ర కోసం ఫిజికల్‌గా, మెంటల్‌గా కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినట్టు తెలుస్తోంది. అజనీష్ బీ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, నీల్ డీ కున్హా డీవోపీ వర్క్ చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. భారీ నిర్మాణ విలువలతో, అద్భుతమైన కథతో నాగచైతన్య కెరీర్‌లో కీలక మైలురాయిగానే కాదు మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో గ్రౌండ్ బ్రేకింగ్ మూవీగా ఈ ప్రాజెక్టు నిలవబోతోందని చెప్తోంది చిత్రబృందం. ఈ సినిమా టైటిల్, మిగతా నటీనటుల వివరాలను త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.