07-11-2025 12:00:00 AM
ఘట్ కేసర్, నవంబర్ 6 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ ఎంసిఎ మొదటి సంవత్సరం విద్యార్థులు పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పారిశ్రామిక సందర్శన ఎంఐసి క్లబ్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, స్టూడెంట్ చాప్టర్ సంయుక్తంగా నిర్వహించబడింది. ఈ సందర్శన విద్యార్థులకు కార్పొరేట్ పనితీరు, సాంకేతిక అభివృద్ధులు, వృత్తిపరమైన పని సంస్కృతి గురించి విలువైన అవగాహనను కల్పించింది. ఇది విద్యార్థుల్లో విద్యా పరిజ్ఞానం, వాస్తవ పరిశ్రమ పద్ధతుల మధ్య దూరాన్ని తగ్గించడానికి దోహదపడింది.
క్యాంపస్లో ప్రదర్శించబడిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వినూత్న ప్రాజెక్టులు విద్యార్థులను ఆకర్షించాయి. ప్రముఖ ఐటీ సంస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడంలో ఈ సందర్శన వారికి చక్కని అనుభవాన్ని అందించింది. ఈసందర్భంలో ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు డాక్టర్ జి. ఎల్. ఆనంద్ బాబు, ఎ. అనీత పారిశ్రామిక సందర్శనల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఇవి విద్యార్థులను భవిష్యత్తు కెరీర్లకు సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఎంసిఎ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ శేఖర్ రెడ్డి తన మద్దతు ప్రోత్సాహాన్ని అందించారు. మొత్తం 100 మంది ఎంసిఎ విద్యార్థులు ఈసందర్శనలో పాల్గొన్నారు. ఈపారిశ్రామిక సందర్శన విద్యార్థులకు విద్యా పరమైన, స్ఫూర్తిదాయకమైన అనుభవంగా నిలిచింది.