calender_icon.png 24 September, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ ప్రీమియర్ లీగ్ 2025

24-09-2025 01:03:41 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ డేటా సైన్స్ విభాగం మరియు ఐఈఈఈ కాంపిటేషనల్ ఇంటలిజెన్స్ సొసైటీ  సంయుక్త ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ప్రీమియర్ లీగ్ 2025 పోటీ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పోటీ రెండు రోజుల పాటు విద్యార్థుల ఉత్సాహభరితమైన పాల్గొనికతో జరిగింది. మొత్తం 175 మంది విద్యార్థులు ఈపోటీలో నమోదు చేసుకున్నారు.  ఇందులో 38 మంది విద్యార్థులు రౌండ్ 2 కి అర్హత సాధించారు.

ఇందులో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. రౌండ్ 3 ఇందులో విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సమస్య పరిష్కార దృక్పథాలను పరీక్షించారు. ఈపోటీలో విజేతలుగా ఎంపికైన విద్యార్థులు నగదు బహుమతి ఐఈఈఈ సిఐఎస్ చాప్టర్ నుండి సర్టిఫికెట్లు అలాగే అత్యుత్తమ ప్రదర్శనకు  గోపాలపుట్టి చందుకర్, శ్రీమన్ రాజ్‌లకు అవార్డు అందజేశారు.