calender_icon.png 24 September, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ అనే సైబర్ మోసం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

24-09-2025 01:03:30 AM

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా ఒక సైబర్ మోసం అని,దీనిని ఎవరూ నమ్మవద్దని డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసం అంటే సైబర్ నేరగాళ్లు తాము పోలీస్ అధికారులు, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది అన్నట్లుగా నటిస్తూ,

మీపై కేసు ఉందని భయపెట్టడం, వీడియో కాల్ లో అరెస్ట్ చేస్తున్నామని చూపించడం, డబ్బులు బదిలీ చేస్తే తప్పించుకుంటారని మోసం చేయడం వంటి నేరాలు పెరుగుతున్న నేపద్యంలో ఇలాంటి నేరాలను నివారించడానికి ప్రజలకు అవగాహన తప్పనిసరి అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్ కి కాల్ చేస్తే డబ్బు తిరిగి రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని, ఆలస్యం చేస్తే నష్టపోవాల్సిందేనని తెలిపారు.

ఎలాంటి ప్రభుత్వ శాఖలు, పోలీసులు డబ్బులు అడగరన్నారు. మీపై కేసులు ఉన్నాయన్న కారణంగా ఎవరైనా వీడియో కాల్ ద్వారా బెదిరిస్తే నమ్మవద్దన్నారు.వెంటనే 1930 నెంబర్ (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్), 100 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.మోసపూరిత కాల్స్, మెసేజెస్, వాట్సాప్ వీడియో కాల్స్ కు స్పందించవద్దని,ఈ రకమైన నేరాల నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సైబర్ సేఫ్టీ పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.