07-07-2025 10:14:27 PM
చివ్వెంల: మండలంలోని చివ్వెంల, తిరుమలగిరి, వట్టి ఖమ్మంపహాడు, చందుపట్ల గ్రామాలలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు(Mandal Agriculture Officer Venkateshwarlu) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పిఎసిఎస్ లలో యూరియా నిల్వలను పరిశీలించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ... చివ్వెంలకు 20 మెట్రిక్ టన్నులు, తిరుమలగిరి పిఎసిఎస్ కి 20 మెట్రిక్ టన్నులు, వట్టి ఖమ్మం పహాడ్, చందుపట్ల పిఎసిఎస్ లలో రైతులకు తగినంత యూరియా ఉందన్నారు. ఇప్పటి వరకు మండలంలో సొసైటీ, డీలర్లు వద్ద కలిపి 142 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ముందస్తుగా యూరియా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సిబ్బంది మహేందర్, మహేష్ పాల్గొన్నారు.