14-05-2025 05:35:00 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు..
హనుమకొండ (విజయక్రాంతి): హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి నేహాల్, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పుట్ట తిరుపతిల ఆధ్యర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల కోఆర్డినేటర్లకు ఐడి కార్డ్, ప్రమాదభీమా 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పత్రాన్నీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని అలాగే ప్రతిపక్షాలు చేసే కుట్రలను, అబద్దాలను తిప్పికొడుతూ ప్రజలకు పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కోఆర్డినేటర్లకు పలు సూచనలు, సలహాలు చేసినారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు మండలాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.