14-05-2025 05:31:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని చాణక్య ఉన్నత పాఠశాల(Chanakya High School)లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి రామారావు(District Education Officer Sri P Rama Rao) బుధవారం సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, 100% హాజరు కావాలని, హాజరు కానివారిపై చర్యలు తీసుకోబడతాయని సూచించారు.
ఉపాధ్యాయులు ఉదయం ఉ. 9.30 ని.లకు హాజరు అయి ఆన్లైన్ లో హాజరు నమోదు చేయాలని, డి ఆర్ పి లు చెప్పే విషయాలు చక్కగా అవగాహన చేసుకోవాలని, ఈ శిక్షణను వినియోగించుకొని, తరగతి గదిలో ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయ కర్త, కోర్స్ ఇంచార్జి యన్ ప్రవీణ్ కుమార్, కోర్స్ ఇంచార్జి ఎన్ విద్యాసాగర్, డిఆర్పిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.