14-05-2025 05:40:37 PM
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేయడమే తన ధ్యేయమని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswamy) స్పష్టం చేశారు. పట్టణంలోని అంగడి బజార్ శివ కేశవ ఆలయం కమాన్, 18వ వార్డ్ గాంధీ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యేగా తాను గెలిచిన అనంతరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నానన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నానన్నారు. పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
పేద ఇంటి ఆడపడుచులకు వరం కళ్యాణ లక్ష్మి పథకమని అర్హులైన ప్రతి ఒక్కరూ కల్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. పట్టణంలోని పలువురికి మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ రవీందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నాయకునికి పరామర్శ..
పట్టణంలోని పాత బస్టాండ్ చెందిన బండి శంకర్ ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బాధితుడిని ఆయన నివాసంలో పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.