22-05-2025 12:00:00 AM
కల్లూరు,మే21(విజయ క్రాంతి) ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లో గురువారం శ్రీ శివాంజనేయ స్వామివారి దేవాలయం పెద్దచెఱ్వు కట్ట వద్ద హనుమాన్ జయంతి ఉత్సవం ఆలయ అర్చకులు వెలమంచిలి వెంకట నాగ సత్య శివకుమార్(హైటెక్) ఆధ్వర్యంలో నిర్వహించబాడుతుంది అని ఆలయ నిర్వాహక కమిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సాంప్రదాయ బద్ధంగా అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవము నిర్వహించబడుతుంద న్నారు.
ఉదయం గం 6-30 నిeలకు 108 మార్లు హనుమాన్ చాలీసా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర భజన బృం దం (సదాశివునిపాలెం) వారిచే భజన కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుంది. తదనంతరం ఫల, తాంబూల, మంగళ హారతి సహిత 108 తమలపాకులతో, హనుమత్ అష్టోత్తరశతనామార్చన భక్తులు 108 తమలపాకులతో, పూజా సామాగ్రితో పాల్గోనవచ్చన్నారు.
సువర్చలా సహిత హనుమత్ కళ్యాణ మహోత్సవము,సమతా ర్యాలీ ఉదయం 9గం కు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నుండి ప్రారంభమై కల్లూరు పురవీధుల గుండా కల్లూరు-పెద్దచెఱ్వు కట్ట ఆంజనేయ స్వామివారి దేవాలయం వద్ద ముగుస్తుందని దేవస్థాన కమిటి తెలిపారు.