calender_icon.png 14 October, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు న్యాయమూర్తులకు వినతులతో విన్నపం

14-10-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ అక్టోబర్ 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్థులు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ మాధవి దేవి లను వారి వారి చాంబర్లలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు సోమవారం కలుసుకుని వినతి పత్రాలు అందజేశారు. జిల్లాకోర్టు ప్రాంగ ణంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని విన్నవించారు.

పార్కింగ్ కు స్థలం, లిఫ్ట్ లు తదితరాలు ఉన్నాయని అవి అన్నియు ఆర్థిక వనరులతో ముడిపడి ఉం డటంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసు కోవాలని మాణిక్ రాజు కోరారు. వినతి పత్రాలు స్వీకరించి పరిశీలించిన న్యాయ మూర్థులు సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. వినతి పత్రాలు అందజేసిన అనంతరం మాణిక్ రాజు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ ని కలిశారు.