16-09-2025 01:07:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): నగరంలోని హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి ౨౬ ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం ఆక్రమణలకు సంబంధించినవే కావడం విశేషం. వర్షాలతో నివాస ప్రాంతా లు ముంపునకు గురవడానికి నాలాల ఆక్ర మణలే ప్రధాన కారణమని పలువురు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
చెరువుల క్యామెం ట్ ఏరియాలను, నాలాల వెడల్పును శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆక్రమణల ను తొలగించాలని వారు హైడ్రా అధికారుల కు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుల్లో మచ్చుకు కొన్ని.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, బాచుపల్లి లోని రేణుక ెుల్లమ్మ కాలనీలో 1600 గజాల పార్కు స్థలంతో పాటు, 800 గజాల ప్రజావసరాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. అలాగే ఉప్పల్ మండలం, బండ్లగూడ నాగోల్‌లోని సర్వే నంబర్ 36/6లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని, సర్వే నంబర్ 35/5కు అనుమతులు ఉన్నాయని చూపిస్తూ కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.