calender_icon.png 11 May, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారం

11-05-2025 12:59:06 AM

హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జడ్జి సుజోయ పాల్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 10 (విజయక్రాంతి): వివాదాల పరిష్కారానికి మధ్యవర్తి త్వం అవసరమని హైకోర్టు యాక్టింగ్ జడ్జి సుజోయపాల్ అన్నారు.

శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, పీవో కుష్బూ గుప్తా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, న్యాయమూర్తులు యువరాజా అనంతలక్ష్మిఅజయ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్‌తో కలిసి కమ్యూనిటీ మెడిటేషన్ సెం టర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ విధులు, విధానాలపై సుజోయపాల్ అవగాహన కల్పించా రు. మధ్యవర్తి త్వం ద్వారా ఇరు వర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో మధ్యవర్తిత్వ కేంద్రం కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

సయోధ్యతో రాజీమార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలలో కేసులు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్, కామారె డ్డి, హైదరాబాద్, వరంగల్‌లో ఈ సెంటర్లను ప్రారంభించినట్టు తెలిపారు. చిన్న చిన్న వివాదాలతో నెలకొన్న సమస్యలను మీడియేషన్ సెంటర్ ద్వారా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోచ్చన్నారు. సమస్యల పరిష్కారానికి పలు కమ్యూనిటీల సభ్యులు ముందుకు రావాలని, వారికి 3 రోజులు శిక్షణ ఇస్తామని చెప్పారు.