01-07-2025 01:35:26 AM
- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, జూన్ 30 (విజయక్రాంతి): ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 37దరఖాస్తులు రాగా, కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా వినతులను స్వీకరించారు.
సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి ప్రజావాణిలో దరఖాస్తు చేస్తారని అలాంటి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్.లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా స్థాయి అధికారులుపాల్గొన్నారు.