calender_icon.png 20 May, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

20-05-2025 12:00:00 AM

  1. కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

ప్రభుత్వ కళాశాల బలోపేతానికి కృషి చేయాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 19 (విజయక్రాంతి):ప్రజావాణి కార్యక్రమంలో అం దిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్  డేవిడ్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబం ధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిం చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అలాగే ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆకాంక్షించారు.  కాగజ్ నగర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సీఈసీ పూర్తి చేసి 947 మార్కులతో జిల్లా ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని ప్రేమలను అదనపు కలెక్టర్ డేవిడ్, డి ఐ ఈ ఓ కళ్యాణి తో కలిసి సోమవారం కలెక్టరేట్ లో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ కళాశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రైవేట్ కళాశాలలతో పోటీపడి విద్యార్థిని ఉత్తమ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థిని సిబ్బంది విద్యార్థులు అభినందించారు.కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.