12-07-2025 07:41:47 PM
కలెక్టర్ హనుమంతరావు
వలిగొండ,(విజయక్రాంతి): భూభారతి రెవెన్యూ సదస్సు(Bhubharathi Revenue Conference)లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(Collector Hanumantha Rao) అన్నారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సులోని దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులకు నోటీసులను పంపించడం జరిగిందో, ఎన్ని దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందో తహసిల్దార్ దశరథను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూభారతిలో ప్రతి దరఖాస్తుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ పల్లవి, ఎన్ఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఆర్ఐ నగేష్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.