05-05-2025 01:45:32 AM
బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బీ సైదులు
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): 2025-26 నూతన విద్యాసంవత్సరానికి బీసీ గురుకులాల్లో డిగ్రీ కోర్సుల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి బీ సైదులు తెలిపా రు. ఈ నెల 15వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటన లో ఆయన సూచించారు.
ఇంటర్ పూర్తి చేసి న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేర కు గడువును పొడించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల న్నారు. ఇప్పటికే మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయనవసరం లేదన్నారు.