calender_icon.png 23 October, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

172 వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం

23-10-2025 01:04:46 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఇప్పటి వరకు 207 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 172 వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాన్ని నియమించామని, మిగిలిన 35 మార్కెట్ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

దాదాపు 2,408 మంది పార్టీ కార్యకర్తలకు నామినేట్ పోస్టులు దక్కాయని, ఈ నియామకాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని అన్నా రు. తెలంగాణ వచ్చాక ఇంత విస్తృత స్థాయిలో నామినేట్ పోస్టులు ఇవ్వడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు.