25-12-2025 02:37:43 AM
మన అగ్రిటెక్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహణ
వరంగల్, డిసెంబర్ 24(విజయక్రాంతి): మన అగ్రిటెక్ వరంగల్‌లో బుధవారం ‘జాతీయ రైతు దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వ హించారు ఈ సందర్భంగా ఏనమాముల గ్రేడ్ సెక్రెటరీ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎనమాముల మా ర్కెట్ బాధ్యతలు చేపట్టిన సెక్రటరీలను మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ సాదరం గా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.గత పది సంవత్సరాలుగా మన అగ్రిటెక్ సంస్థ ద్వారా విశిష్ట సేవలను ఆయనకు వివరించారు.
మన అగ్రిటెక్‌లో ఏర్పాటు చేసిన ఒక్క స్టాల్‌ను చూపిస్తూ ఆధునిక వ్యవసాయ పరికరాలు వాటి పని తీరును వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన జాతీ య రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొని పలువురికి రైతులకు సన్మానం చేసి కేక్ కట్ చేసి శు భాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం మన అగ్రిటెక్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు హాజ రై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు ఆశీస్సులతో అందరూ బాగుండాలి ఆకాంక్షించారు.