05-01-2026 01:45:21 AM
జమైతుల్ ఉల్ మా రాష్ట్ర అధ్యక్షుడు ఎహాసాసోద్దిన్, ప్రధాన కార్యదర్శి సబీర్ సాహెబ్
కోదాడ, జనవరి 4: ఇస్లాం మతస్తుల పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న దుర్గాపూర్ మదర్స వ్యవస్థాపకులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ అభినందనీయులని జమైతుల్ ఉల్ మా రాష్ట్ర అధ్యక్షుడు ఎహాసాసోద్దిన్, ప్రధాన కార్యదర్శి సబీర్ సాహెబ్ లు అన్నారు. ఆదివారం కోదాడ లోని దుర్గాపురం మదర్సా లో జమైతుల్ ఉల్ మా రాష్ట్ర అధ్యక్షుడు ఎహాసాసోద్దిన్ కు నిర్వహించిన అభినందన సన్మాన కార్యక్రమం లో వారు మాట్లాడారు. గత 50 ఏళ్లుగా వేలాది మంది పేద పిల్లలకు ఉచిత వసతి, ఉచిత ఆధ్యాత్మిక, సాధారణ విద్యను అందిస్తూ ప్రయోజకులు చేయడం లో పాఠశాల వ్యవస్థాపకులు అబ్ధుల్ ఖాదర్ సాహెబ్ ప్రశంస నీయులన్నారు.
కాగా పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువు అబ్దుల్ ఖదీర్ కు కారు బహుకరించి తమ గురు భక్తిని చాటుకున్నారు. పూర్వ విద్యార్థులు గురువు కు బహుమతి గా కారు ఇవ్వడం పట్ల పూర్వ విద్యార్థులను ముఖ్య అతిథులు అభినందించారు. కాగా ఆర్గనైజర్ మదీనా మోడల్ స్కూల్ చైర్మన్ మౌలనా అహ్మద్ నధ్వి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆధ్యాత్మిక జిజ్ఞాస పెంపొందించడమే తమ లక్ష్యం అన్నారు.కాగా వివిధ ప్రాంతాల నుండి వెయ్యి మందికి పైగా పూర్వ విద్యార్థులు, ఆధ్యాత్మిక వేత్తలు తరలి వచ్చారు. ఆర్గానైజర్ మౌలానా అహ్మద్ నధ్వి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో జిల్లా అధ్యక్షుడు మౌలానా అత్తహర్, మిరాజుదిన్, మౌలానా హమీద్ సాబ్,హఫీజ్ అబ్దుల్ ఖదీర్, ముఫ్తీ అత్తహర్ తదితరులు పాల్గొన్నారు.