calender_icon.png 7 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌లు ఐక్యతతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

05-01-2026 01:43:40 AM

నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం

చిట్యాల, జనవరి 4 (విజయ క్రాంతి): సర్పంచులందరూ ఐక్యతతో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన  పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్   కాటం వెంకటేశం  ఆయన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం ను శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులందరూ ఐక్యతతో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని, నా వంతుగా పరిష్కరిస్తానని సర్పంచులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షుడు జోగు సురేష్ తాళ్ల వెళ్ళాంల గ్రామ సర్పంచ్, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య సుంకెనపల్లి సర్పంచ్, కార్యదర్శి మిర్యాల వెంకటేశం నేరడ సర్పంచ్, కోశాధికారి మహిపాల్ రెడ్డి వణిపాకల సర్పంచ్ మరియు ఎలుకట్టే సర్పంచ్ సాగర్ల యాదమ్మ యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.