04-12-2025 12:00:00 AM
కోలాహలం రామ్ కిశోర్ :
భారతదేశంలో ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజల జీవితాలు మొబైల్ ఫోన్లతో ముడిపడి ఉన్నాయి. ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతి లొకేషన్.. ఇవన్నీ మన స్వేచ్ఛా జీవితాల్లో భాగం. కానీ మోదీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక ఆదేశం ఈ స్వేచ్ఛను ఆపదకు గురిచేస్తోంది. ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని కేం ద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెల్‌ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, కంపెనీలను, యూనిట్స్‌ను ఆదేశించింది.
అయి తే ప్రభుత్వం మాత్రం ఈ యాప్ ఫోన్ దొంగతనాలు, స్కామ్‌లు నిరోధించడానికి ఉప యోగపడుతుందని చెబుతోంది. అయితే ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా సాంకేతిక నిపుణులు.. ఇది రక్షణ వాగ్దానమా లేక ప్రజలను పర్యవేక్షించే గూఢ చర్యం ఆయుధమా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. తద్వారా డిజిటల్ హక్కుల రక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘సంచార్ సాథీ’ యాప్ 2023 మేలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్యూనికేషన్స్ (డాట్) చేత ప్రవేశపెట్టబడింది.
ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్లాట్‌ఫామ్‌గా, మొబైల్ యూజర్లకు ఫోన్ గుర్తింపు (ఐఎమ్‌ఈఐ వెరిఫికేషన్), కోల్పోయిన డివైస్‌ల ట్రాకింగ్, అనధికార సిమ్‌లు బ్లాక్ చేయడం వంటి సౌకర్యాలు అందిస్తుంది. ప్రభుత్వం ప్రకారం 2023 నుంచి 6 లక్షలకు పైగా కోల్పోయిన ఫోన్లు పునరుద్ధరి ంచబడ్డాయి. ఈ యాప్ కింద ఒక్క క్షణానికి ఒక ఫోన్ ట్రేస్ అవుతున్నట్లు సమాచా రం.
57 లక్షల సిమ్‌లు బ్లాక్ చే యడంతో పాటు, 17 వేల దొంగ ఫోన్లను అడ్డుకున్నాయి. ఇది ‘డిజిటల్ భారత్’ విజన్‌లో భాగంగా, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘యాప్ వాడకం ఐచ్ఛికం మాత్రమే.. వారి మొబైల్స్ నుంచి యాప్‌ను తొలగించే హక్కు ప్రజలకే ఇస్తున్నాం’ అని అన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
సంచార్ సాథీ యాప్ ‘పర్సనల్ డేటా’ ను క్యాప్చర్ చేయలేదని, యూజర్ అనుమతి లేకుండా ఏమీ చేయదని ప్రభుత్వం వాదిస్తోంది. టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 కింద జారీ చేసిన ఈ ఆదేశం, 90 రోజుల్లో అమలు చేయాలం టూ యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, షియో మీ వంటి కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాలని కూ డా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ‘సేఫ్టీ ప్రామిస్’ వెనుక దాగి ఉన్న వాస్తవాలు భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. యాప్ కు కాల్స్, సందేశాలు, స్టోరేజ్, లొకేషన్, కెమెరా యాక్సెస్ అవసర మవుతుంది. ఇది (ఐఎమ్‌ఈఐ) స్పూఫింగ్‌ను నిరోధిస్తుందని చెప్పినా, ప్రజల ఫోన్ యాక్టివిటీని పూర్తిగా మానిటర్ చేసే బ్యాక్‌డోర్‌గా మారే అవకాశం ఉందని నిపుణుల వాదన. కొందరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ సాంకేతిక నిపుణులు మాత్రం సంచార్ సాథీని ‘బిగ్ బ్రదర్’ వా చింగ్‌గా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ఇది బీజేపీ అధికారులతో కుమ్మకై.. ప్రజల మాటపై నిఘా పెట్టడానికి మరో ప్రయత్నం చేస్తుంది’, ‘ ఇది మరో డిక్టేటర్‌షిప్’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచార్ సాథీ యాప్‌ను ఒక ‘స్నూపింగ్ యాప్’గా, ‘ఫ్రాడ్ రిపోర్టింగ్, వ్యక్తిగత సమాచారం తస్కరించే అవకాశం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి ఈ యాప్ ను పెగాసస్‌తో పోలు స్తూ.. ‘ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి’ అని ఆరోపించారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఔవైసీ స్పంది స్తూ.. ‘ప్రజల ప్రైవసీని ధ్వంసం చేసేందుకు మోదీ ప్రభుత్వం మరో ప్రయత్నానికి తెర లేపింది’ అని ట్వీట్ చేశారు.
సులభతర యాప్‌లు..
సంచార్ సాథీ యాప్‌పై ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్.. ‘ఇది రీసెండ్ అయ్యే వరకు పోరాటం చేస్తాం’ అని ప్రకటించిం ది. ఈ విమర్శలు ఆధార్ రహితం కాదు. 2017లో సుప్రీంకోర్టు ప్రైవసీని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హ క్కుగా గుర్తించింది. కానీ, మోదీ ప్రభుత్వం అప్పటి నుంచి గోప్యతకు వ్యతిరేకంగా నిలబడిందనే విమర్శలు పెరిగిపోయాయి. ‘పెగాసస్ స్కాండల్”లో ప్రభుత్వం జవాబుదారీతనం చూపలేదు. ఇప్పుడు సం చార్ సాథీ పేరుతో కొత్త యాప్‌ను తీసుకురావడం.. 73 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో బలవం తంగా ఇన్‌స్టాల్ చేయాలని చూడడం ప్రజ ల గోప్యతపై ఇది నిఘా టూల్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ యాప్ అయినా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాల్సిన అవసరముంది. అయితే సంచార్ సాథీ విషయంలో మాత్రం యూజర్ ఎంపికను బలహీనపరిచేలా ఉంది. యాపిల్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు యాప్‌పై ఫిర్యాదు చేయడానికి మానసికంగా తమ సంసిద్ధతను చూపడం లేదు. యాపిల్ ‘ప్రైవసీ రి స్క్‌లు’ అని చెప్పి, మధ్య మార్గంలో ప్రజ లు నిత్య జీవితంపై ౨౪/౭ నిఘాను ఉం చాలని చూస్తోంది. ఈ ఆర్థిక బలవంతం ద్వారా ఆయా కంపెనీల మార్కెట్‌ను కోల్పోవడానికి అవకాశముంది.
గోప్యతకు భంగం!
ప్రభుత్వం వాదనలు ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలోనూ లోపాలు ఉన్నాయి. యూరప్ లాంటి దేశాల్లో జీడీపీఆర్ వంటి చట్టాలు గోప్యతకు ప్రాధాన్యతను ఇస్తా యి. భారత్‌లో మాత్రం ‘సేఫ్టీ’ పేరుతో ప్రజలపై నిఘా పెట్టే ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఈ యాప్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు యాక్సెస్ చేస్తారు? పార్లమెంట్‌లో చర్చ లేకుండా రహస్యంగా జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీడి యా రిపోర్టుల ప్రకారం, ఇది ‘పర్మనెంట్ సర్వైలెన్స్ బ్యాక్‌డోర్’గా మారవచ్చు. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. మోదీ ప్ర భుత్వం ‘లాఫుల్ ఇంటర్‌సెప్షన్’ సిస్టమ్‌ల ద్వారా స్నూపింగ్ చేస్తోంది. ఈ వివాదం మన డిజిటల్ భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. సర్వులైన్స్ రాజ్యంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరు, రాజకీయాలు చేయలేరు. ప్రభుత్వం మాత్రం ‘సేవా తీర్థ్’ పేరుతో పీఎంఓను మార్చుకుంది. ‘సంచార్ సాథీ’ యాప్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరిగి, పారదర్శక పాలసీని రూపొందించాలి. యాప్‌ను ఐచ్ఛికంగా ఉంచి, బలమైన సమాచార రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. అలా జరగకపోతే డిజిటల్ భారత్ కాస్త ‘డిస్టోపియన్ భారత్’గా మారిపోతుంది. ఈ యాప్ వివాదం మాత్రమే కాదు. ఇది గోప్యతకు భంగం కలిగించ డంతో పాటు స్వేచ్ఛా హక్కులపై చట్టరీత్యా యుద్ధం చేయడమే అవుతుంది.