calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటాకు చెల్లుచీటి.. పాత ఓటే!

04-12-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

* బీసీలకు స్థానిక సంస్థలతో పాటు, ఉద్యోగ, విద్యా పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను తీసుకువచ్చింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డెడికేటెడ్ కమిషన్ వేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్ విడుదలతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొన్నది. వివి ధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకు స్మార్ట్ ఫోన్లకు పని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడకంలో వెనుకబడిన వారు వివిధ వర్గాల ప్రజలను, కుల సంఘాల నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు.

గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరి రెండో తేదీతో, జిల్లా, మండల పరిషత్ పాలక వర్గాల పదవీకాలం గత ఏడాది జూలైలో, కొన్ని మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి నెలాఖరులో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు ఫిబ్రవరిలో ముగిశాయి. అయితే ఆయా సంఘా ల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల వరకు పొడిగించింది.

గత ఏడాదిన్నరగా కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే అధికార పార్టీ వ్యూహానికి న్యాయపరమైన చిక్కులు అడ్డు తగి లాయి. ఒకవైపు పంచాయతీలు అభివృద్ధికి నోచుకోక.. నిధుల లేమి సమస్య వేధిస్తున్న క్రమంలో ప్రభుత్వం నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు, అప్పు డు అంటూ ఊరిస్తూ ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ ఇ చ్చింది. 20 నెలలుగా రిజర్వేషన్ల అంశం పేరుతో సాగదీసి, కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు పోవడాన్ని బీసీ సమాజం జీర్ణించుకోలేకపోయింది. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల అ మలుకోసం ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై బీసీ సమాజం గుర్రుగా ఉన్నది.

బీసీలకు పెద్దపీట..

గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారు లు, గ్రామ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదే అదనుగా విపక్షాలు దాడికి పూనుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పాల్సి వచ్చింది. 

తె లంగాణ ప్రభుత్వం కులగణన చేసి, దేశానికి రోల్ మోడల్ గా ఊరిచ్చి, రిజర్వేషన్లు అమలు చేయడం మా లక్ష్యం అంటూ కాంగ్రెస్ అనేక సార్లు ప్రకటన చేసింది. దానికి కట్టుబడి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లకుండా, పార్టీలకు గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలకు వెళ్లి 90 శాతం పంచాయతీలు సాధించి తీరాలని పార్టీ పరంగా 42 శాతం టికెట్లను బీసీలకు ఇస్తామని ప్రకటించింది. ఈ హడావిడికి కార ణం జూబ్లీ హిల్స్‌లో ఉప ఎన్నికలో కాం గ్రెస్ విజయ దుందుభి మోగించడమే.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతులు మర్చిపోక ముందే పంచాయతీల్లో తమ భవితవ్యం తేల్చుకొనేందుకు వ్యూహత్మక అడుగులు వేసింది. ఆలస్యం అయితే రబీ సీజన్ రైతు భరోసా ప్రభావం ఎన్నికల మీద పడుతుందని పసిగట్టిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నది.

ముందుగానే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా స్థానిక నాయకులకు ఈ నెలాఖరు లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే లీకులతో 42 శాతం రిజర్వేషన్ల స్థా నాల్లో వచ్చిన బీసీ అభ్యర్థులను అలర్ట్ చేసింది. కోర్టు అడ్డంకితో మారిన పాత రిజర్వేషన్లలో అన్ని పార్టీలు రిజర్వేషన్ల అం శం కాకుండా గెలుపుగుర్రాలకు పెద్దపీట వేసి పల్లెల్లో సందడి చేస్తున్నారు.

బేరసారాలు..

రెండు విడతలుగా నామినేషన్లు పూర్తికావడం, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ప్రత్యర్థులను రాజీ చేసుకోవడం కోసం తమ ప్రయత్నా లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో బంధాలు, బంధుత్వాలు ఏమి పనిచే యడం లేదనేది స్పష్టంగా కన్పిస్తున్నది. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చె ల్లెలు, వదిన మరదలు, బావ బావమరిది పోటీకి దిగే విధంగా ఆయా పార్టీలు ఎరవేసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

అభ్యర్థులు మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని డబ్బులు ఖర్చుచేసి, అప్పులపాలైన సంఘటనలు గుర్తు చేసుకొని కొత్త ఒరవడికి నాంది పలికారు. కేవలం స్మార్ట్ ఫోన్లను నమ్ముకొని గ్రామం లో ప్రతి ఓటరుకు చేరే విధంగా పోటీదారుల అనుచరులు ఒకవైపు అభ్యర్థనలు, ప్ర త్యర్థులపై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టేశారు. ఏకగ్రీవం చేసుకోవడానికి అధికా ర పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని, సంక్షేమ పథకాలు అందిస్తామని బేరాలకు దిగింది.

అదే విధంగా ప్రత్యర్థులు మేమేం తక్కువ తిన్నామా అన్నట్లు.. వచ్చేది మా ప్రభుత్వమే అంటూ లొంగదీసుకునే ప్ర యత్నం కొనసాగిస్తున్నారు. రాజకీయ పార్టీలు బతిమిలాడడం, బెదిరించడం అనేది పేటెంట్ హక్కుగా జీవిస్తున్నారు. ఇటీవల అమానుషమైన నల్గొండ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. చాల చోట్ల ‘దుడ్డు ఉన్నోడిదే బర్రె అన్నట్లు’గా రాజకీయ ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు.

పార్టీల గుర్తులు లే కుండా జరిగే పల్లె సీమల అభివృద్ధి కో సం, గ్రామాల్లో ఖర్చు చేసిన డబ్బులు రా వడం కోసం జై కొట్టడం సహజంగా మా రింది. గత కేసీఆర్ ప్రభుత్వం.. సర్పంచ్‌లు, ప్రకృతి వనాలు, రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, ఇతర మౌలిక వసతులకు ఖర్చు చేసిన రూ. 700 కోట్ల బిల్లులు ఇవ్వనందుకు సొంత పార్టీనే బొందపెట్టారనే ప్రచారం ఉంది.

ఓట్లకోసం తంటాలు!

రాష్ట్రంలో అధికార పార్టీ ‘మేమెంతో.. మాకంతా’ అనే నినాదం ఎత్తుకోవడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణనను నిర్వహించింది. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు, ఉద్యోగ, విద్యా పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు స్థానిక సంస్థ ల్లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను తీసుకువచ్చింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డెడికేటెడ్ కమిషన్ వేసింది.

రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ర్టం లో జనాభాలో అత్యధికంగా 56.33 శాతానికి పైగా బీసీలు ఉన్నారని నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ రాష్ర్టంలో బీసీల జనాభా అధిక భాగమన్న విషయం తెలిసిందే. అందుకే బీసీ రిజర్వేషన్లకు శాసన సభలో ఏకగ్రీవంగా బిల్లులకు ఆమోదం తెలిపాయి. బీసీ జేఏసీ అక్టోబర్ 18న బందుకు పిలుపు ఇస్తే అన్ని పార్టీలు రోడ్డు మీదకు వచ్చి తమ మద్దతు ఇచ్చాయి.

బీసీ సంఘాల వేదికలపై కపట ప్రేమ చూపెడుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ‘నువ్వే ద్రోహి అంటే..నువ్వే ద్రోహి’ అని సోషల్ మీడి యా వేదికగా ఓట్లకోసం నానాతంటాలు పడుతున్నారు. నాడు 2019లో 2,345 పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అయితే మొత్తంగా బీసీలు 4,274 మంది సర్పంచ్‌లు  విజయం సాధించా రు.

తాజాగా ఇప్పుడు 12,760 పంచాయతీల్లో 5,359 స్థానాల్లో బీసీలు గెలిస్తే కాంగ్రెస్ తమ పార్టీ పరంగా ఇచ్చినదానికి ఒక సార్థకం ఉంటుంది. పార్టీ గుర్తులు లేకుండా పోటీచేసే ఎన్నికలు కాబట్టి, ఎవరూ గెలిచినా మా పార్టీ వాళ్లేనని అధికార పార్టీ చెప్పడం సహజం. 1981లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గెలిచిన సర్పంచ్‌లను కాంగ్రెస్ అభ్యర్థులేనని ప్రకటించిన సంగతి మరచిపోలేము.

 వ్యాసకర్త సెల్:- 9866255355