04-11-2025 12:17:23 AM
							ఘట్ కేసర్, నవంబర్ 3 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో ఎంఐసి క్లబ్, ఐఈఈఈ ఎస్‌ఎస్‌ఐటి స్టూడెంట్ చాప్టర్ మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎంసిఎ విద్యార్థుల కోసం రెండు రోజుల ఆప్టిట్యూడ్, రీజనింగ్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ వర్క్‌షాప్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ జి.ఎల్. ఆనంద్ బాబు, ఎంసిఎ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ జి. శేఖర్ రెడ్డి, ఐటీ విభాగాధిపతి డాక్టర్ నితీషా శర్మ అతిథి వక్త టి.ఎ.ఎస్.కె నుండి అనుభవజ్ఞురాలైన ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ట్రైనర్ బోడిగే భార్గవి ని స్వాగతిస్తూ ప్రారంభమైంది.
ప్రముఖులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నియామక సంసిద్ధత కోసం తార్కిక ఆలోచన, సమయ నిర్వహణ నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించారు. భార్గవి ఆప్టిట్యూడ్, రీజనింగ్ సమస్యలను వేగంగా, ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రభావవంతమైన వ్యూహాలను వివరిస్తూ ఆకర్షణీయమైన సెషన్‌లు నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో దాదాపు 200 మంది ఎంసిఎ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.