04-11-2025 12:18:46 AM
మణికొండ, నవంబర్ 3, విజయక్రాంతి : మణికొండ మున్సిపాలిటీకి నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. లాంకో హిల్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కార్యాలయ పనులను సోమవారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు.పనులను దగ్గరుండి పరిశీలించిన ఆయన, నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. నూతన కార్యాలయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి, మణికొండ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు.