06-08-2025 12:17:16 AM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్ ఆగస్టు 5 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం గట్టు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది ఆడపడుచులకు కళ్యాణి లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పే దింటి ఆడపడుచుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి పథకం పెళ్లికి కానుకగా రూ 1లక్ష 116 రూపాయలను అందిస్తున్నారని అదేవిధంగా రైతులకు రైతుబంధు రైతు బీమా రైతు రుణమాఫీ,సన్న బియ్యము,మహిళలకు ఉచిత ప్రయాణం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ఎన్నికల హామీలలో చెప్పిన ప్రకారం ఒక దాని తర్వాత ఒకటి నెరవేరుస్తున్నారని తెలిపారు.
అధికార పార్టీలో భాగస్వామ్యం సంక్షేమ పథకాలు నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఉంటుందని పార్టీకి మద్దతు తెలిపి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జి.వేణు గోపాల్,ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.