05-11-2025 01:41:26 AM
ఈ ఏడాది ‘తండేల్’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడాయన ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రంతో రానున్నారు. ప్రస్తుతానికి ‘ఎన్‌సీ24’ వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ) ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాపినీడు సమర్పిస్తున్న.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. తాజాగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మీనాక్షి ‘దక్ష’గా కనిపించనుందని వెల్లడించారు. మీనాక్షి గుహల మధ్య పురాతన వస్తువులను పరిశీలిస్తున్నట్టు న్న ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఫీల్డ్ డ్రెస్, గ్లవ్స్, గ్లాసెస్‌తో అంకితభావం, ధైర్యం గల ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనుంది. ఈ కథలో మీనాక్షి పాత్ర చాలా కీలకంగా ఉండనుంది.
భావోద్వేగాలు పలికించగల, నటనకు ఆస్కారం ఉన్న దక్ష పాత్ర మీనాక్షి కెరీర్‌లో ఓ మైలురాయిలాగా మిగిలిపో నుందని టీమ్ పేర్కొంటోంది. కథానాయకుడు నాగచైతన్య కూడా ఈ చిత్రం లో మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. ‘లా పతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ జోరుగా కొనసాగుతోంది.
ప్రధాన తారాగణం అంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బీ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, రగుల్ డీ హెరియన్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.